మెహిదీపట్నం, వెలుగు: నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు వేర్వేరు వ్యక్తులు మిస్సింగ్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుశీలమ్మ అనే వృద్ధురాలు తన మనవడి వైద్యం కోసం వచ్చి, మిస్సింగ్ అయ్యింది. అలాగే షాద్‌నగర్‌కు చెందిన విజయ్ కుమార్ (38) అనే వ్యక్తి తన నవజాత శిశువు చికిత్స కోసం వచ్చి, ఈనెల 13న రాత్రి భోజనానికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
ఆసుపత్రి పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఈ ఘటనలపై బాధిత కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి ఎస్సై సాయి కుమార్ తెలిపారు.
