మహారాష్ట్రలో ఇద్దరు మహిళలు కొట్టుకున్న వీడియో వైరల్ గా మారింది. నాసిక్ లో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ.. మాటమాట పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. టోల్ సిబ్బంది, కారులోని మహిళ రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. టోల్ ఫీజు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
ముందుగా కారులోని మహిళ బయటకు దిగి టోల్ గేట్ సిబ్బంది చెంప చెళ్లుమనిపించింది. అంతటితో ఆగకుండా ఉద్యోగి చేతులను మెలితిప్పి దాడి చేసింది. దీంతో సిబ్బంది కూడా మహిళపై ఘర్షణకు దిగింది. ఇద్దరూ మరాఠీలో తిట్టుకుంటూ ఘోరంగా కొట్టుకున్నారు. నడిరోడ్డుపై ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ గొడవంతా టోల్ ప్లాజా దగ్గరున్న సీసీటీవీలో రికార్డయ్యింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
