V6 News

ఆధార్ లో కొత్త అప్ డేట్స్.. ప్రకటించిన ఉడాయ్

ఆధార్ లో కొత్త అప్ డేట్స్.. ప్రకటించిన ఉడాయ్

ఆధార్‌కు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి... తాము తమ గుర్తింపు కార్డుకు ఏ మొబైల్ నెంబర్, ఏ మెయిల్ ఇచ్చారో తెలియకపోవటం. చాలా మంది వినియోగదారులకు తమ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడిలో ఏది ఆధార్‌తో లింక్ చేయబడిందో తెలియకపోవడం. లేదా ఖచ్చితంగా తెలియడం లేదని అధికారులు చెప్పారు. కానీ కొత్తగా వచ్చిన ఓ ఫీచర్ సాయంతో ఆ సమస్యను పరిష్కరించవచ్చు. మీ ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే ఈ కింద పేర్కొన్న లింక్ సాయంతో స్టేటస్ ను తెలుసుకోండి.

  • “https://myaadhaar.uidai.gov.in/” లేదా   https://myaadhaar.uidai.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.
  • మై ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, వెరిఫై ఇ మెయిల్, మొబైల్ నంబర్ ను సెలక్ట్ చేసుకోండి.
  • మొబైల్ నంబర్ ను ధృవీకరించడానికి వెరిఫై మొబైల్ నంబర్ ను ఎంచుకోండి.
  • మెయిల్ అడ్రస్ ను ధృవీకరించడానికి వెరిఫై మెయిల్ అడ్రస్ ను ఎంచుకోండి.
  • ఆపై మొబైల్ నంబర్, మెయిల్ వివరాలను నమోదు చేసి, దిగువ ఇచ్చిన క్యాప్చాను ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత ఓటీపీపై క్లిక్ చేసి, ఓటీపీని ఎంటర్ చేయండి.

నమోదు చేసిన ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడనట్లయితే, వినియోగదారులు తీసుకోవాల్సిన చర్యలను ఇది తెలియజేస్తుంది. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు ఒకవేళ ఇంతకుమునుపే ఇచ్చినవి అయితే ఇప్పటికే మా రికార్డ్‌లతో ధృవీకరించబడింది' అనే మెసేజ్ ను స్ర్కీన్ పై చూడవచ్చు.