హైదరాబాద్‌లో ఘనంగా యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

హైదరాబాద్‌లో ఘనంగా యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రవీంద్రభారతి వేదికగా కళాకృతి నృత్యాలయ ఆధ్వర్యంలో యాదాద్రి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్-2026  వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ప్రదర్శించిన నృత్య రీతులు ప్రేక్షకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేశాయి.

ఈ సాంస్కృతిక వేడుకకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా ... అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ గడ్డం సరోజా వివేక్ వెంకటస్వామి గౌరవ అతిథిగా హాజరయ్యారు. 

ఈ వేదికగా కళారంగంలో దశాబ్దాలుగా విశేష కృషి చేసిన పలువురు దిగ్గజాలకు యాదాద్రి జాతీయ పురస్కారాలు ఘనంగా అందజేశారు. ప్రముఖ సినీ, సంగీత, కళా విశ్లేషకులు వి.ఎ.కె. రంగారావు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గీతాచంద్రన్, ప్రముఖ నర్తకి షారన్ లోవెన్, విశిష్ట నృత్యకారిణి డాక్టర్ అరుణా భిక్షు ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. కళారంగానికి వారు అందించిన సేవలను ఈ సందర్భంగా అతిథులు కొనియాడారు.

ఈ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్‌లో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువ  అనుభవజ్ఞులైన కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీతో పాటు అరుదైన గోటి పువా నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. విభిన్న నృత్య రూపాల సమ్మేళనంతో రవీంద్రభారతి ప్రాంగణం కళాకారుల కోలాహలంతో కళకళలాడింది.