వాట్సాప్‌ వెబ్‌ వాడుతున్నారా?

వాట్సాప్‌ వెబ్‌ వాడుతున్నారా?

ఎక్కువ మంది యూజర్లు వాట్సాప్‌‌ను స్మార్ట్‌‌ఫోన్లలోనే వాడుతున్నారు. అయితే అప్పుడప్పుడు డెస్క్‌‌టాప్‌‌ లేదా లాప్‌‌టాప్‌‌పై వాడుతారు. దీనికి డెస్క్‌‌టాప్‌‌ బ్రౌజర్‌‌‌‌లో ‘వాట్సాప్‌‌ వెబ్‌‌’ ఓపెన్‌‌ చేసి, మొబైల్‌‌లోని వాట్సాప్‌‌ వెబ్‌‌తో స్కాన్‌‌ చేయాల్సి ఉంటుంది. అయితే మొబైల్‌‌లో వాడినంత ఈజీగా డెస్క్‌‌టాప్‌‌పై వాట్సాప్‌‌ వాడలేరు. స్మార్ట్‌‌ఫోన్‌‌ వాట్సాప్‌‌లో ఉన్న అన్ని ఫీచర్లను డెస్క్‌‌టాప్‌‌పై ఎలా వాడుకోవాలో తెలియక పోవడమే ఇందుకు కారణం.

ఈ ఫీచర్స్‌‌ను ‘వాట్సాప్‌‌ వెబ్‌‌’లో ఎలా వాడాలో తెలుసుకుంటే బెటర్‌‌‌‌.

వాట్సాప్‌‌ వెబ్‌‌లో ఎమోజీలు వాడటం చాలా సులభం. టెక్స్ట్‌‌ బార్‌‌‌‌కు ఎడమవైపు ఎమోజి ఐకాన్‌‌ కనిపిస్తుంది. అలాగే ‘:’ టైప్‌‌ చేసి, ఎమోజి రియాక్షన్‌‌కు సంబంధించిన ఫస్ట్ రెండు అక్షరాలు టైప్‌‌ చేస్తే దానికి తగ్గ ఎమోజి టెక్స్ట్‌‌ను రీప్లేస్‌‌ చేస్తుంది. ఎమోజి ట్రే కూడా కనిపిస్తుంది.

ఎమోజీలకు బదులు ఎమోటికాన్స్‌‌ కూడా వాడొచ్చు. ఒకప్పుడు ఎమోటికాన్స్‌‌నే ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు ఎమోటికాన్స్‌‌ను ఎమోజీలుగా మార్చుకునే వీలు కూడా ఉంది. ఇంగ్లీష్‌‌లో ‘ఎమోటికాన్​ వై’ టైప్‌‌ చేస్తే అది ‘థమ్స్‌‌అప్‌‌’ ఎమోజిగా మారిపోతుంది. ఇలా చాలా రకాల ఎమోటికాన్స్‌‌ ఎమోజీలుగా మారుతాయి.

స్మార్ట్‌‌ఫోన్‌‌లో రెండు వాట్సాప్‌‌ అకౌంట్లు వాడుకునే వీలున్నట్లే డెస్క్‌‌టాప్‌‌పై కూడా ఒకేసారి రెండు వాట్సాప్‌‌లు వాడుకోవచ్చు. డెస్క్‌‌టాప్‌‌పై ఒక బ్రౌజర్‌‌‌‌లో ఒకే అకౌంటు వాడుకోవచ్చు. రెండు అకౌంట్లు కావాలంటే వేరే బ్రౌజర్‌‌‌‌ ఓపెన్‌‌ చేయాలి. అలాగే గూగుల్‌‌క్రోమ్‌‌లో ‘ఇన్‌‌కాగ్నిటో మోడ్‌‌’ సెట్‌‌ చేసుకుంటే ఒకేసారి రెండు వాట్సాప్‌‌ వెబ్‌‌లు వాడొచ్చు.

‘వాట్సాప్‌‌ వెబ్‌‌’పై కూడా ‘పిక్చర్‌‌‌‌ ఇన్‌‌ పిక్చర్‌‌‌‌’ మోడ్‌‌ వాడుకోవచ్చు. అంటే వాట్సాప్‌‌లోని ఫొటోలు, వీడియోల లింక్‌‌ క్లిక్‌‌ చేసి, యాప్‌‌లోనే చూడొచ్చు. దీనికోసం వాట్సాప్ క్లోజ్‌‌ చేసి, ఫేస్‌‌బుక్‌‌, యూట్యూబ్‌‌ వంటి యాప్స్‌‌ ఓపెన్‌‌ చేయక్కర్లేదు.

వాట్సాప్‌‌ స్టేటస్‌‌ షేర్‌‌‌‌ చేసుకోవచ్చు!

‘వాట్సాప్‌‌’ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫీచర్‌‌‌‌ ‘స్టేటస్‌‌ షేరింగ్‌‌’. ఇప్పటివరకు స్టేటస్‌‌ డైరెక్ట్‌‌గా షేర్‌‌‌‌ చేసే అవకాశం లేదు.
అయితే ఇప్పుడీ ఫీచర్‌‌‌‌  అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్‌‌. యూజర్లు తమ స్టేటస్‌‌ను షేర్‌‌‌‌ చేసుకోవచ్చు. అయితే అది ‘ఫేస్‌‌బుక్‌‌’లో మాత్రమే. టెక్స్ట్, ఫొటోలు, వీడియోల రూపంలో ఉన్న స్టేటస్‌‌ను అప్‌‌లోడ్‌‌ చేసిన తర్వాత ఈ ఫీచర్‌‌‌‌ను వాడుకోవచ్చు. స్టేటస్‌‌ అప్‌‌లోడ్‌‌ చేసిన తర్వాత, ‘షేర్‌‌‌‌ టు ఫేస్‌‌బుక్‌‌ స్టోరీ’ నోటిఫికేషన్‌‌ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్‌‌ చేస్తే వెంటనే మీ ఫేస్‌‌బుక్‌‌ పేజ్‌‌పై ఈ స్టోరీ అప్‌‌లోడ్‌‌ అవుతుంది. దీన్ని ఆటోమేటిగ్గా అప్‌‌లోడ్‌‌ చేసుకునే అవకాశం లేదు. ఫేస్‌‌బుక్‌‌లో ఈ స్టోరీని కస్టమైజ్‌‌ చేసుకోవచ్చు. దీనివల్ల కావాల్సిన వాళ్లు మాత్రమే స్టేటస్‌‌ స్టోరీ చూసే వీలుంటుంది.