కార్పొరేటర్, ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్ ​మధ్య యూటర్న్​ లొల్లి

కార్పొరేటర్, ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్ ​మధ్య యూటర్న్​ లొల్లి

గచ్చిబౌలి, వెలుగు: యూటర్న్​ విషయంలో గచ్చిబౌలి కార్పొరేటర్​, ట్రాఫిక్​ రిజర్వ్​ఇన్​స్పెక్టర్​మధ్య వాగ్వాదం జరిగింది. ఖాజాగూడ సిగ్నల్​ నుంచి ఓఆర్​ఆర్​కి వెళ్లే రోడ్డుపై కరాచీ బేకరీ సమీపంలో ఉన్న యూటర్న్​ను మాదాపూర్​ ట్రాఫిక్​ పోలీసులు ఇటీవల క్లోజ్​చేశారు. అయినా కొందరు సిమెంట్​దిమ్మెలను తొలగించి రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం మాదాపూర్​ ట్రాఫిక్​ రిజర్వ్​ ఇన్​స్పెక్టర్​ భాస్కర్​ సిబ్బందితో కలిసి యూటర్న్​ను క్లోజ్​ చేస్తుండగా.. కార్పొరేటర్​ సాయిబాబా అక్కడికి చేరుకున్నారు. యూటర్న్​ కోసం రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని, ఇది క్లోజ్​ చేయొద్దని చెప్పారు. ‘నువ్వెవరు నాకు చెప్పడానికి’ అంటూ ఇన్​స్పెక్టర్​ స్పందించడంతో కార్పొరేటర్​ స్థానికులతో కలిసి రోడ్డుపై కొద్దిసేపు ధర్నా చేశారు. దీనిపై ట్రాఫిక్​ రిజర్వ్​ ఇన్​స్పెక్టర్​ వివరణ కోసం ‘వెలుగు’ రిపోర్టర్​ఫోన్​ చేయగా, ఆయన లిఫ్ట్​ చేయలేదు.

ప్రముఖ టీవీ సీరియల్ నటి ఆత్మహత్య