వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ను మార్చండి..లేదంటే సెక్రటేరియెట్ ముట్టడిస్తాం: వడ్డెర సంఘం హెచ్చరిక

వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ను మార్చండి..లేదంటే సెక్రటేరియెట్ ముట్టడిస్తాం: వడ్డెర సంఘం హెచ్చరిక

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ నియామకంపై పునరాలోచించి, ఆ పేరును వెంటనే మార్చాలని తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శివరాత్రి అయిలిమల్లు డిమాండ్ చేశారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ధర్నాలో ఆయన మాట్లాడారు. 

వడ్డెరుల సమస్యలు, స్థితిగతులపై ఎలాంటి అవగాహన లేని గుంజ రేణుకను చైర్మన్​గా నియమించడం వల్ల తమ సామాజిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వడ్జెరుల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులనే ఈ పదవిలో నియమించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్డెరులను సమీకరించి ‘చలో సచివాలయం’ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. నిరసనలో కె. అంజయ్య, ఎత్తరి గణేశ్, గుర్రం శ్రీనివాస్, శివరాత్రి బిక్షం, మంజుల నాగేశ్ పాల్గొన్నారు.