Blackmail: వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’ మొదలైంది.. లాభాల్లో 10 శాతం

Blackmail: వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’ మొదలైంది.. లాభాల్లో 10 శాతం

వరుణ్ సందేశ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. శ్రీనివాస్ గుండ్రెడ్డి  -దర్శకత్వంలో  హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘బ్లాక్ మెయిల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు.

ముహూర్తపు షాట్‌‌‌‌కు రచయిత, నిర్మాత కోన వెంకట్ క్లాప్ కొట్టగా, నిర్మాత తమ్మారెడ్డి  భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేశారు.  జెమిని సురేష్ తల్లి ఎం. వెంకట సుబ్బలక్ష్మి తొలి షాట్‌‌‌‌కు దర్శకత్వం వహించారు. నటుడు రక్షిత్ అట్లూరి, నటి శ్రీలు తదితరులు హాజరై మూవీ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. మంచి కంటెంట్‌‌‌‌తో ఈ చిత్రం రాబోతోందని వరుణ్ సందేశ్ చెప్పాడు.

ఈ సినిమా లాభాల్లో 10 శాతం టెక్నీషియన్స్‌‌‌‌కు అందజేస్తానని నిర్మాత అవినాష్  ప్రకటించారు. ఈ చిత్రంలో జెమిని సురేష్, పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీఎస్ చక్రవర్తి రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్‌‌‌‌వీ మల్లిక్ తేజ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రాఘవేంద్ర రెడ్డి ఎడిటర్‌‌‌‌గా పనిచేస్తున్నారు.  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని మూవీ టీమ్ తెలియజేసింది.