ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్.. .TG 09G 9999 కి రూ.18 లక్షలు..

 ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్.. .TG 09G 9999 కి రూ.18 లక్షలు..

హైదరాబాద్​ సిటీ, వెలుగు: వెహికల్ ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రూ.43,57,406 ఆదాయం వచ్చినట్లు జేటీసీ రమేశ్ తెలిపారు. 

టీజీ09జీ9999 నంబర్​ను కీస్టోన్ ఇన్​ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.18 లక్షలకు సొంతం చేసుకుంది. టీజీ09కే0006 నంబర్​ను అనంత లక్ష్మీ కుమారి నామాల రూ.7,06,666కు దక్కించుకున్నారు. టీజీ09కే0005 నంబర్​ను నేహా అగర్వాల్ రూ.1,89,001కు, టీజీ09జే9909 నంబర్​ను సాయి వెంకట్ సునగ్ పాలడుగు రూ.1,44,999కు సొంతం చేసుకున్నారు. టీజీ09కే0009 నంబర్​ను శ్రీనివాసా కన్​స్ట్రక్షన్స్ రూ.1,00,000కు, టీజీ09కే0001 నంబర్‌ను ఇషానీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,00,000కు  దక్కించుకున్నాయి.