MI vs KKR : శతకొట్టిన వెంకటేష్ అయ్యార్.. ముంబైకి భారీ టార్గెట్

MI vs KKR : శతకొట్టిన వెంకటేష్ అయ్యార్.. ముంబైకి భారీ టార్గెట్

వాంఖడే స్టేడియంలో వెంకటేష్ అయ్యార్ విశ్వరూపం చూపించాడు. తన ధనాధన్ ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు ఫోర్లతో విరుచుకుడి కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో కోల్ కత్తా 185 పరుగుల భారీ స్కోరు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన కోల్ కతాకు చేదు అనుభవం ఎదురైంది. ఓపెనర్లు రెహ్మానుల్లా (8, 12 బంతుల్లో), జగదీషన్ (0, 5 బంతుల్లో) విఫలం అయ్యారు. మొదటి వికెట్లో వచ్చిన వెంకటేష్ అయ్యార్ (104, 51 బంతుల్లో) ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సర్లు ఫోర్లు బాదుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కేకేఆర్ బ్యాటర్లలో ఏ ఒక్క బ్యాట్స్ మెన్ క్రీజులో వెంకటేష్ అయ్యర్ కు తోడు నిలవలేకపోయారు. షార్దూల్ ఠాకూర్ (13, 11 బంతుల్లో), రింకు సింగ్ (18, 18 బంతుల్లో) అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. చివర్లో రస్సెల్ (21,11 బంతుల్లో) చెలరేగడంతో కోల్ కతా 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హ్రితిక్ శోకీన్ 3 వికెట్లు దక్కాయి. గ్రీన్, జాన్సన్, పియూష్ చావ్లా, మెరిడిత్ కు చెరో వికెట్ పడగొట్టారు.