షూటింగ్ లో గాయపడ్డ వెంకటేష్

షూటింగ్ లో గాయపడ్డ వెంకటేష్

షూటింగ్ లో విక్టరీ వెంకటేశ్ కు గాయాలయ్యాయి. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ వెంకీ మామా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలీం సిటీలో జరుగుతుంది. ఓ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు వెంకటేశ్ కాలు బెణికింది.  వెంటనే ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు వెంకటేశ్ ను కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారని సినిమా యూనిట్ తెలిపింది. మొదటి సారిగా వెంకీ మామాలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేశ్ కు జోడీగా పాయల్ రాజ్ పూత్, నాగచైతన్యకు  జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు.