వెంకీ బర్త్ డే గిఫ్ట్.. నారప్ప టీజర్ రిలీజ్

వెంకీ బర్త్ డే గిఫ్ట్.. నారప్ప టీజర్ రిలీజ్

ఆదివారం విక్టరీ వెంకటేశ్ బర్త్ డే  సందర్భంగా ఆయన అభిమానులకు గిఫ్ట్  ఇచ్చారు. శ్రీకాంత అడ్డాల డైరెక్షన్ లో నటిస్తున్న కొత్త మూవీ నారప్ప టీజర్ రిలీజ్ చేసింది టీం. ఈ టీజర్ లో వెంకటేశ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. తలకు పాగ,బొట్టు,గడ్డంతో పంచకట్టులో ఉన్నాడు.  చేతిలో కత్తి పట్టుకుని చాలా ఆవేశంతో పగతో రగిలిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ మూవీకి  మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ రీమేక్ గా ఈ మూవీ వస్తుంది. ప్రకాశ్ రాజ్,రావుర్ రమేష్ ,రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.