- గ్రౌండింగ్ పూర్తయ్యాక లబ్ధిదారులకు నిధులు
కరీంనగర్, వెలుగు: హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రెండో విడత దళిత బంధు స్కీమ్ అప్లికేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక కలెక్టర్ అధ్యక్షతన జరిగే కమిటీ సమావేశంలో అప్రూవల్ అయ్యాక యూనిట్లను గ్రౌండింగ్ చేసి, నిధులు విడుదల చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ప్రస్తుతం 1,005 అప్లికేషన్లను వెరిఫై చేస్తున్నట్లు దళిత బంధు నోడల్ ఆఫీసర్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ తిరుపతిరావు తెలిపారు.
జిల్లాలో 3,800 వరకు పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయని, వెయ్యి అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక మిగతావి పరిశీలిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో హుజురాబాద్ బై ఎలక్షన్ సందర్భంగా నియోజకవర్గంలో 18,021 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో సగం మందికే అప్పట్లో పూర్తి స్థాయిలో యూనిట్లు మంజూరు కాగా.. మిగతా లబ్ధిదారులను రెండో విడతలో చేర్చారు.
