
ప్రసెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడానికి బుల్లితెర నుంచి..వెండితెర వరకు స్టార్స్ పోటీ పడుతున్నారు. హీరోయిన్లతోను, యాంకర్స్ తోను డ్యాన్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫామ్ పెంచుకుంటున్నారు. ఇక లేటెస్ట్ గా బుల్లితెర యాంకర్ రవి(Anchor Ravi ) నెటిజన్స్‌ను స్పెషల్‌గా అట్రాక్ట్ చెయ్యడానికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సోషల్ మీడియాను వాడేస్తున్నారు. యాంకర్ రవికి తోడూ..బిగ్ బాస్‌తో ఫేమస్ అయినా అరియనా(Ariyana),అషు రెడ్డి(Ashu Reddy) సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటారు.
ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒకే రూమ్ లో రామయ్య వస్తావయ్యా సాంగ్‌కు మాస్ స్టెప్పులేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా..ఈ వీడియోను ఆన్లైన్ లో పెట్టేశారు యాంకర్ రవి. అంతేకాదు అరియానా, అషు రెడ్డిలతో కలిసి దిగిన ఓ రొమాంటిక్ పిక్ షేర్ చేస్తూ.. ఇద్దరు మరదళ్ల ముద్దుల బావ అనే క్యాప్షన్ పెట్టేశాడు. దీంతో ఈ పిక్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. ఎంజాయ్ అంటే నీదేలే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అరియానా, అషు రెడ్డి, యాంకర్ రవితో చాలా చనువుగా ఉంటారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా మీరు ముగ్గురు కలిసి ఒకేసారి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే అరియానా లావై పోయిందని, అషు బ్యూటీ గా మారిందంటూ మెసేజెస్ తెలుపుతున్నారు.