వైకల్యం నా శరీరానికే..ప్రతిభకు కాదు

వైకల్యం నా శరీరానికే..ప్రతిభకు కాదు

అంగవైకల్యం ఉన్నా తానెవరికీ తీసిపోనని నిరూపిస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు.

బ్యాటుకూ బంతికి మధ్య సమరం క్రికెట్‌లో మజాను అందిస్తుంది..అందుకే మనదేశంలో క్రికెట్ అంటే అంత అభిమానం.. గల్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా కళ్లప్పగించి చూస్తారంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆట మజా రుచిచూపించేందుకు ఓ బుడ్డోడు గల్లీ  గ్రౌండ్ లో రెచ్చిపోయాడు. అంగవైకల్యంతో ఉన్నా సరే బ్యాటింగ్ లో తనకు తనే సాటని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆ బుడ్డోడు బ్యాటింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఐఎఫ్ ఎస్ అధికారి సుధారేమాన్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఓ బుడ్డోడు తన బ్యాటింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటున్నాడు. అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా తన సహచరల్ని పరుగులు పెట్టిన ఈ గల్లి క్రికెటర్ పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

హీరోలు స్క్రీన్ పైన మాత్రమే కనిపిస్తారు. కానీ ఇలాంటి నిజమైన హీరోలు  నిజజీవితంలో చాలా అరుదుగా తారసపడుతుంటారు. ఇతర పిల్లలకు ఈ బ్యాట్స్ మెన్ ఆదర్శం కావాలని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

బాలుడి గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ బాలుడి ఆచూకీ చెప్పండి, మేం ఏదైనా సాయం చేస్తామంటూ మరికొంతమంది నెటిజన్లు సుధా రామెన్ ను కోరుతున్నారు.