విదిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైశాలికి టైటిళ్లు

విదిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైశాలికి టైటిళ్లు
  • ఫిడే గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్విస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో విక్టరీ
     
  • క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీకి క్వాలిఫై

ఐల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ మ్యాన్ (యూకే) :  ఫిడే గ్రాండ్​ స్విస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇండియా డబుల్ ధమాకా మోగించింది. గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్​ గుజరాతి, ఆర్. వైశాలి ఓపెన్, విమెన్స్ సెక్షన్​లో  టైటిళ్లు సొంతం చేసుకున్నారు. అదే విధంగా ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయ్యారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్​ చివరి, 11వ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైశాలి మంగోలియాకు చెందిన బక్త్యుయగోతో డ్రా చేసుకోగా.. ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విదిత్ సెర్బియాకు చెందిన అలెగ్జాండర్ ప్రెడ్కేను ఓడించాడు. ఈ ఇద్దరూ 8.5 పాయింట్లతో తమ కేటగిరీల్లో సమీప ప్రత్యర్థుల కంటే 0.5 పాయింట్ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విజేతలుగా నిలిచారు. వచ్చే ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెనడాలో జరిగే క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీకి క్వాలిఫై అవ్వడంతో పాటు విదిత్ రూ. 66 లక్షలు, వైశాలి రూ. 20 లక్షల  ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ అందుకున్నారు.