హైదరాబాద్లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ఓన్లీ ఫుడ్ యాప్ షురూ

హైదరాబాద్లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ఓన్లీ ఫుడ్ యాప్ షురూ

హైదరాబాద్, వెలుగు:    రైడ్​ హేలింగ్​ కంపెనీ రాపిడో    ఫుడ్ డెలివరీ సేవలు హైదరాబాద్​లో మొదలయ్యాయి. ఇందుకోసం ఓన్లీ ఫుడ్​ యాప్​ను అందుబాటులోకి తెచ్చింది.  జీరో కమీషన్ విధానం కావడం వల్ల రెస్టారెంట్లు ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కస్టమర్లు డెలివరీ చార్జీ మాత్రమే చెల్లించాలి.  నగరంలో రాపిడో కెప్టెన్ల సేవలను గుర్తించేందుకు ప్రత్యేకంగా బిర్యానీ పార్టీ నిర్వహించారు.

ఈ వేడుకకు తెలుగు నటుడు నాని హాజరై వారితో ముచ్చటించారు. రాపిడో కో–ఫౌండర్​ అరవింద్ మాట్లాడుతూ హైదరాబాదీలు మంచి ఆహారాన్ని ఇష్టపడతారని తెలిపారు. ఈ కొత్త విధానంతో రెస్టారెంట్ యజమానులకు, కస్టమర్లకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.