ఖుషి OTT రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

ఖుషి OTT రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), స్టార్ బ్యూటీ సమంత(Samantha) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi). క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు యావరేజ్ హిట్ గా నిలిచింది. దీంతో చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న విజయ్ అండ్ సమంతకు మంచి విజయాన్ని అందించింది ఖుషి మూవీ. సాంగ్స్ చాలా పెద్ద సక్సెస్ అవడంతో.. ఖుషి సినిమా చూసేందుకు ఆడియన్స్ పరుగులు తీశారు. దీంతో ఈ సినిమాకు మొదటి వీకెండ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఆతరువాత చాలా వరకు డ్రాప్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమా రూ.70 కోట్ల గ్రస్స్ కలెక్ట్ చేయగా.. నిర్మాతలకు రూ.12 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

Also Read :- బిగ్ బాస్ సీజన్7లో మూడో వారం ఎలిమినేషన్‌.. ఈ ఇద్దరిలో ఎవరు?

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఖుషి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా అక్టోబర్‌ 1 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్ లో మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.