OTTలోకి ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

OTTలోకి ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi). సమంత(Samantha) హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీ  సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈసినిమాకు ఆడియన్స్ నుండి యావరేజ్ టాక్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా.. ఐదు రోజుల్లో దాదాపు రూ.65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అవుట్ అండ్ అవుట్ లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాను క్లాస్ చిత్రాల దర్శకుడు శివనిర్వాణ తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఏకంగా రూ.90 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. దీంతో ఈ సినిమా అక్టోబర్ 6 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.