విజయ్ లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం.. గట్టిగా పట్టేసుకుంది

విజయ్ లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం.. గట్టిగా పట్టేసుకుంది

విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సమంత(Samantha) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi). క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్‌ 1న విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. విడుదలైన రెండు రూ.50 కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ సినిమా. 

ఇక ఖుషి సినిమా అందించిన విజయంతో ఆనందంలో ఉన్న ఖుషి టీమ్ ఆదివారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ ఫ్యాన్స్ భారీగా కొండపైకి చేరుకున్నారు. అంతేకాదు.. విజయ్‌తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. అందులో ఒక విజయ్ లేడీ ఫ్యాన్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది. విజయ్ గుడి నుండి బయటకు వస్తున్న సమయంలో ఏకంగా విజయ్‌ను హత్తుకునేందుకు ప్రయత్నించింది ఆ అమ్మాయి. అది గమనించిన బాడీగార్డులు ఆమెను అడ్డుకోవడంతో   .. చివరకు విజయ్ తో సెల్ఫీ దిగి సంతృప్తి చెందింది. 

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు హీరో విజయ్ దేవరకొండ.. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా కలిసొచ్చింది. న తమ్ముడి బేబీ సినిమా, నా ఖుషి సినిమా రెండూ విజయవంతం అయ్యాయి. అందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనానికి వచ్చాము. కొన్నేళ్ల క్రితం యాదాద్రి వచ్చినప్పుడు గుడి అంతగా లేదు. పునర్నిర్మాణంలో యాదాద్రిని అద్భుతమైన ఆలయంగా మార్చిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. మా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కు ఈ ఏడాది రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఖుషి సినిమా కూడా హిట్ అయ్యింది. మాలాగే ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నా.. అని చెప్పుకొచ్చాడు విజయ్.