రూ. 52 కోట్లకు కింగ్‌ఫిషర్‌‌ హౌస్‌ సేల్‌

రూ. 52 కోట్లకు కింగ్‌ఫిషర్‌‌ హౌస్‌ సేల్‌

న్యూఢిల్లీ: బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన కింగ్‌‌ ఫిషర్‌‌ బాస్‌‌ ఒకప్పుడు హెడ్‌‌క్వార్టర్‌‌గా వాడిన బిల్డింగ్‌‌ను వేలం వేశారు. హైదరాబాద్‌‌కు చెందిన ప్రైవేటు బిల్డర్‌‌ కింగ్‌‌ఫిషర్‌‌ హౌజ్‌‌ను రూ.52 కోట్లకు దక్కించుకున్నారు. అయితే ఈ బిల్డింగ్ అమ్మేందుకు బ్యాంకులు గతంలోనూ వేలాలు నిర్వహించినా సక్సెస్‌‌ కాలేకపోయాయి. అప్పుడు రిజర్వు ధర ఎక్కువగా ఉండటం, కొన్ని రిస్ట్రిక్షన్లు విధించడం ఇందుకు కారణం. కింగ్‌‌ఫిషర్‌‌ హౌజ్‌‌ ముంబై ఎయిర్‌‌పోర్టు దగ్గర ఉంది. డెవెలప్‌‌మెంట్‌‌ పెద్దగా అవకాశాలు ఉండవనే ఆలోచనతో అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. ఈ బిల్డింగ్‌‌ను మొదటిసారిగా 2016లో రూ.150 కోట్ల రిజర్వు ధరతో వేలం వేశారు. తరువాత కూడా వేలాలు వేసినా రెస్పాన్స్‌‌ రాలేదు. మాల్యాను కోర్టులు ఇది వరకే ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి. కింగ్‌‌ఫిషర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌ 2012లో దివాలా తీసింది. దీంతో మాల్యా బ్యాంకులకు రూ.12 వేల కోట్లకు వరకు ఎగ్గొట్టి లండన్‌‌ పారిపోయాడు. ఇతణ్ని ఇండియాకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది. బ్రిటిష్‌‌కోర్టు కూడా గత నెల ఇతణ్ని దివాలాకోరుగా ప్రకటించింది. మాల్యా ఆస్తులను అమ్మేందుకు  అనుమతులు ఇచ్చింది.