తండ్రిగా చేసిన అమ్మాయితో రొమాన్స్ చేయలేను: విజయ్ సేతుపతి

తండ్రిగా చేసిన అమ్మాయితో రొమాన్స్ చేయలేను: విజయ్ సేతుపతి

తమిళ హీరో విజయ్ సేతుపతి(Vijay sethupathi)కి ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే చాలు.. ఈ లాంగ్వేజ్ ఆడియన్స్ అయినా చూసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి క్రేజ్ ను సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. ఓపక్క హీరోగా చేస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా విలన్ గా కూడా అలరిస్తున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. ఇక షారుఖ్ హీరోగా వచ్చిన లేటెస్ట్  సూపర్ హిట్ మూవీలో కూడా విలన్ గా చేసి ఆడియన్స్ ను అలరించారు విజయ్ సేతుపతి. '

అయితే తాజాగా విజయ్ సేతుపతి గురించి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. విజయ్ సేతుపతి హీరోగా కొత్త సినిమా స్టార్ అవుతోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి పేరును సూచించారట దర్శకుడు. అయితే.. ఉప్పెన సినిమాలో కృతికి తండ్రగా విజయ్ సేతుపతి చేసిన విషయం తెలిసిందే. దీంతో తండ్రిగా చేసిన అమ్మాయికి ఇప్పుడు జోడీగా చేయాలంటే నావల్ల కాదు అని చెప్పారట విజయ్ సేతుపతి. 

అయితే ఒక సినిమా విషయంలో ఇంతలా ఆలోచించడం ఏంటి అని విజయ్ సేతుపతిని అడగగా.. ఉప్పెన సినిమా క్లైమాక్స్ షూట్ లో కృతి ఇబ్బంది పడుతుంటే.. నాకు నిజ జీవితంలో కూడా ఇంతే వయసున్న కూతురు ఉందని, కాబట్టి నువ్వు కూడా నా కూతురి లాంటి దానివే అని, నన్ను నిజంగా ఓ తండ్రిలా అనుకోని సీన్ పూర్తి చేయమని చెప్పాడట విజయ్. అందుకే కొత్త సినిమాలో కృతి హీరోయిన్ గా వద్దని చెప్పాడట విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.