సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్: విజయశాంతి

సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్: విజయశాంతి

సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. మార్చి 25 శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో "మా నౌకరీలు మాగ్గావాలి" పేరుతో బీజేపీ పార్టీ నిరుద్యోగ మహా ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో విజయశాంతి పాల్గొన్ని మాట్లాడారు. TSPSC పేపర్ లీకేజీలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉందన్నారు విజయశాంతి. క్రిమినల్ పనులు చేసేది కేసీఆర్ ప్లెజర్.. ఇల్లీగల్ గా దందాలు చేసేది కేసీఆర్ ప్రెజర్.. ఇది కేసీఆర్ నిజస్వరూపం అని ఆమె విమర్శించారు.కేసీఆర్ చేసేవన్నీ ఫ్రాడ్ పనులు.. దాంట్లో మళ్లీ భేరాలు ఆడుతాడని.. ఆయనకు కావాల్సింది లాభాలు మాత్రమేనని మండిపడ్డారు విజయశాంతి. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పేపర్ లీకేజీ కావడంతో వారికి (కేసీఆర్,కేటీఆర్) చెడ్డ పేరు వస్తుందని.. నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులకు ఫీజులు మాఫీ చేస్తామని.. ఉచితంగా భోజనాలు పెడతాం, పుస్తకాలు పంపిణీ చేస్తామని మాయ మాటలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు విజయశాంతి. 3 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని .. వెంటనే రాజీనామా చేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు.