శ్రీలక్ష్మీ గణపతిస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీలక్ష్మీ గణపతిస్వామికి ప్రత్యేక పూజలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్చారణల మధ్య మూలవిరాట్ శ్రీలక్ష్మీ గణపతిస్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అధర్వ శీర్ష ద్వార మహాభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి చతుషష్టి పూజలు నిర్వహించారు. 

నాగిరెడ్డి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల్లో భాగంగా లక్ష్మీగణపతి స్వామి వారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అభిషేకం, అర్చనలు, శ్రీ గణేశ పురాణం, ప్రవచనం జరుగుతాయి. 7వ తేదీన శాస్త్రీయ పద్దతిలో ధర్మగుండంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.