ఖానాపూర్ లో   కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలు తిప్పికొట్టాం

ఖానాపూర్ లో   కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలు తిప్పికొట్టాం
  • బీజేపీ రాష్ట్ర ముఖ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్   

హైదరాబాద్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ పీఠంపై బీజేపీ జెండా ఎగరడం.. కాంగ్రెస్ అహంకారానికి, వారి కుట్రల రాజకీయానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎన్ని కుతంత్రాలు చేసినా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ బీజేపీ అద్భుత విజయం సాధించిందని కొనియాడారు. ఇటీవల నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ - ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు ఎలా బహిర్గతమయ్యాయో.. ఖానాపూర్‌‌‌‌‌‌‌‌లోనూ అదే తీరు కనిపించిందన్నారు.

బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయనీ, అధికార పార్టీ బెదిరింపులు బీజేపీ గెలుపును ఆపలేకపోయాయని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా బలపడుతోందని పేర్కొన్నారు. ఈ గెలుపు కేవలం ఒక మున్సిపాలిటీకే పరిమితం కాదని, తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక మైలురాయి అని అన్నారు.