సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రోటోకాల్ లొల్లి

సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రోటోకాల్ లొల్లి

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎలా చెక్కులు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. 

ఓడిపోయిన వాళ్లను స్టేజ్ పైకి ఎలా పిలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మధ్వ వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరినొకరు నెట్టేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను సమావేశం నుంచి బయటకు పంపించారు.