కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా స్టిక్కర్లు కలకలం రేపాయి. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థుల రక్తం మోడీ చేతుల్లో అంటూ మోడీ ఫోటో ఉన్న ఫ్లెక్సీపై స్టిక్కర్లు అంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బస్టాండ్ దగ్గర కేంద్ర సంక్షేమ పథకాల ఫ్లెక్సీపై ఈ స్టిక్కర్లు ప్రత్యక్షమయ్యాయి.
ఫ్లెక్సీల మీద విద్యార్థుల రక్తం మోడీ చేతుల్లో అంటూ రాతలు, AK-47 గన్ చిత్రాలతో కూడిన స్టిక్కర్లను మోడీ ఫోటోపై అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనపై సీరియస్ అయ్యారు స్థానిక బీజేపీ శ్రేణులు.
ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.ఒక దేశవ్యాప్తంగా జెన్ Z ల ఉద్యమం బీజేపీని కలవరపెడుతున్న క్రమంలో ఈ స్టిక్కర్ల ఉదంతంతో స్థానిక బీజేపీ క్యాడర్ ఉలిక్కిపడింది.
