మంత్రి సమక్షంలో  కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సర్పంచ్

మంత్రి సమక్షంలో  కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సర్పంచ్

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి సమక్షంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్​కు చెందిన బీఆర్ఎస్​సర్పంచ్​సెగ్యం వెంకటేశ్​ కాంగ్రెస్​లో చేరారు. ఆదివారం హైదరాబాద్​లో సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్​లీడర్లు మంత్రిని కలిశారు.ఈ సందర్భంగా సర్పంచ్​వెంకటేశ్​తోపాటు వార్డు సభ్యులకు మంత్రి వివేక్​కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్​సర్కార్, మంత్రి వివేక్​వెంకటస్వామి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై కాంగ్రెస్​లో చేరినట్లు సర్పంచ్​తెలిపారు. పోన్నారం సర్పంచ్​పెంచాల మధు, లీడర్లు నీలయ్య, గందె రాంచందర్​తదితరులున్నారు.