బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ బయటపడింది

బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ బయటపడింది
  • చైర్​పర్సన్ ఎన్నికను స్వాగతిస్తున్నా
  • ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని.. మున్సిపల్ చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ ఎన్నికతో మరోసారి బయటపడిందని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం జరిగిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనైతిక పొత్తుతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో గెలిచాయన్నారు.

రెండుసార్లు జరిగిన ఎన్నిక సమావేశానికి ఈ రెండు పార్టీలు ఎందుకు రాలేదో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ పాలకవర్గానికి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో కౌన్సిల్ సభ్యులు చిన్నం సత్యనారాయణ, నిమ్మల రమేశ్, గొర్రె తిరుమల, సాజిదా బేగం తదితరులు పాల్గొన్నారు.