అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్న వేళ బులియన్ మార్కెట్లు బేజారిపోతున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ కొరవడటంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ కిందికి పడిపోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రేట్ల తగ్గుదలతో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్రాంతంలోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి ముందుకు వెళ్లటం బెటర్.
ఏప్రిల్6న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్5 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.180 తగ్గింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 913గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 670గా కొనసాగుతోంది.
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్6, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు స్థిరంగా రూ.2లక్షల 55వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.255గా అమ్మకాలు జరుగుతున్నాయి.
