నోట్లో పడింది.. నీళ్లపాలైంది!

నోట్లో పడింది.. నీళ్లపాలైంది!

దాని నోట్లోకొచ్చి పడింది బువ్వ. కానీ, అంతల్నె మిస్సైపాయె. నీళ్ల పాలయ్యె. హంప్​బ్యాక్​ వేల్​ ఈదుకుంట ఈదుకుంట పోతూ ఉన్నట్టుండి పైకి లేచింది. అక్కడ్నె ఉన్నదో ఏమో ఈ సీ లయన్​ (సీల్​) దాని నోట్లోకి జారి పడ్డది. అయిపోయాన్రా దేవుడా అనుకుంటుండగానే తప్పించుకుని నీళ్లలోకి దూకింది. బతికిపోయింది. కాలిఫోర్నియాలోని మోంటరరీ బేలో కనిపించిందీ దృశ్యం. అమెరికాకు చెందిన చేజ్​ డెక్కర్​ అనే ఫొటోగ్రాఫర్​ దానిని క్లిక్​మనిపించాడు.

అయితే, సీల్స్​ లాంటి జంతువులను తిమింగలాలు తినవంటున్నాడు డెక్కర్​. ఎందుకంటే, వాటి గొంతు చిన్నగా ఉంటుందట. సీల్​ లాంటి జంతువులు పట్టవట. అందుకనే చిన్న చిన్న వాటిని తినేస్తుంటాయట ఈ హంప్​బ్యాక్​ వేల్స్​. తినేముందు భారీగా నీళ్లనూ నోట్లో ఉంచుకుని వాటిని మింగేస్తాయట. కానీ, ఈ సీల్​ విషయంలో మాత్రం ఆ తిమింగలం గట్టిగానే ప్రయత్నించినా, ఆ చిన్న సీల్​ చాన్స్​ మాత్రం ఇవ్వలేదు.

viral pic: Sea lion falls into mouth of a whale and What happened next is fascinating

viral pic: Sea lion falls into mouth of a whale and What happened next is fascinating