V6 News

కోహ్లీకి ICC మందలింపు

కోహ్లీకి ICC మందలింపు

బెంగళూరు: సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో దురుసుగా ప్రవర్తించినందుకు టీమిండియా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీని మ్యాచ్‌‌‌‌ రెఫరీ మందలించాడు. రూల్స్‌‌‌‌ను ఉల్లంఘించినందుకు ఓ డీ మెరిట్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను కేటాయించాడు. ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌  ఐదో ఓవర్‌‌‌‌లో రన్‌‌‌‌ తీసే క్రమంలో సఫారీ బౌలర్‌‌‌‌ బ్యూరాన్‌‌‌‌ హెండ్రిక్స్ భుజాన్ని కోహ్లీ దురుసుగా తాకాడు.

దీనిని గమనించిన ఫీల్డ్‌‌‌‌ అంపైర్లు కెప్టెన్‌‌‌‌పై రెఫరీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫుటేజ్‌‌‌‌ను పరిశీలించిన రిఫరీ..  ఐసీసీ కోడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కండక్ట్‌‌‌‌లోని ఆర్టికల్‌‌‌‌ 2.12 ను విరాట్‌‌‌‌ ఉల్లంఘించాడని తేల్చారు. దీనికి శిక్షగా అధికారిక మందలింపుతో పాటు డీ మెరిట్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను కేటాయించారు.