Mark Antony Twitter Review: మార్క్ ఆంటోనీ.. మడతెట్టి హిట్ కొట్టిన విశాల్.. ఎక్స్ రివ్యూ

Mark Antony Twitter Review: మార్క్ ఆంటోనీ.. మడతెట్టి హిట్ కొట్టిన విశాల్.. ఎక్స్ రివ్యూ

తమిళ స్టార్ విశాల్ (Vishal) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని(Mark Antony). అధిక రవిచంద్రన్(Adhik Ravichandran) తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో.. ఎస్ జె సూర్య(Sj surya), సునీల్(Sunil), సెల్వ రాఘవన్(Selva raghavan), రీతూ వర్మ(Ritu varma), అభినయ(Abhinaya) కీ రోల్స్ ప్లే చేశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ..  ఈరోజు(సెప్టెంబర్ 15) ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. 

ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడటంతో.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తన ఒపీనియన్ ను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మరి సినిమాపై ప్రేక్షకుల రివ్యూ ఎలా ఉంది? మార్క్ ఆంటోనీ గా విశాల్ ఏమేరకు మెప్పించాడు? చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విశాల్ కు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. 

సినిమాకు ఆడియన్స్ నుండి యునానిమస్ పాజిటీవ్ టాక్ వస్తోంది. టైం ట్రావెల్ కథతో విశాల్ ఇరగదీశాడనే కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో ప్రధాన పాత్రలో కనిపించిన ఎస్ జే సూర్య సినిమాకె హైలెట్గా నిలిచారట. ఆయన నటన చాలా అద్భుతంగా ఉందని కామెంట్స్ అందరి నుండి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవీ ప్రకాష్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ ల్లో నిలబెట్టిందట. మొత్తానికి చాలా కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న విశాల్.. సాలిడ్ హిట్ పడింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.