చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న సోషిబయో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం ఏకంగా పదిహేనుకు పైగా సెట్స్ వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న 'విశ్వంభర' క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజువల్ వండర్‌గా ఉండబోతోందని మేకర్స్ చెప్పారు.
ఈ ఇంటెన్స్ క్లైమాక్స్‌కి యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్, ఎడిటింగ్ గ్రాఫిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కునాల్ కపూర్, సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది.