పళనిస్వామి నియామకం చెల్లదు

 పళనిస్వామి  నియామకం చెల్లదు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా  పళనిస్వామి నియామకం చెల్లదని అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ అన్నారు. పార్టీ కేడర్ ద్వారా ఎంపిక చేయబడిన వ్యక్తి మాత్రమే జనరల్ సెక్రటరీగా ఉంటారని చెప్పారు. డీఎంకేలో వారసత్వ పోరు నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారని చెప్పారు. ఇదే పరిస్థితి ఎంజీఆర్ స్థాపించిన పార్టీలో రాకూడదన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీని కిందిస్థాయి కార్యకర్తలే ఎన్నుకోవాల్సిన పరిస్థితిని ఎంజీఆర్ కల్పించారని..కానీ ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఆ పనిచేయడం లేదన్నారు. అన్నాడీఎంకేలో ఉన్న  ప్రస్తుత నాయకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారని శశికళ మండిపడ్డారు. సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేశారని చెప్పారు.  ఈ క్లిష్టపరిస్థితుల్లో..అన్నాడీఎంకే కార్యకర్తలందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు.  నాయకత్వ పదవిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తే అది ఎప్పటికీ నిలవదన్నారు. డబ్బు ద్వారా పొందే ఏ స్థానమూ శాశ్వతం కాదని చెప్పారు. అది చట్టబద్ధంగా కూడా చెల్లదని శశికళ వ్యాఖ్యానించారు.