ఆఫ్రికా దేశం కామొరోస్ అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందుకున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో ఆయన పర్యటిస్తున్నారు. కామొరోస్ అధ్యక్షుడు అసౌమని చేతుల మీదుగా వెంకయ్య ఈ అవార్డును అందుకున్నారు. ఖద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రిసెంట్గ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని, 130 కోట్ల భారతీయుల తరపున గౌరవాన్ని స్వీకరిస్తున్నానని తెలిపారు. భారత్,కామొరోస్ స్నేహానికి గుర్తుగా అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని, సంయుక్త లక్ష్యమే తమను కలిపిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

