వరంగల్, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై జనాల వద్ద ఎలాంటి సమాచారమున్న 87126 85257 కు వాట్సప్ ద్వారా తెలపాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం ఆయన పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు.
అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లోని మోటర్ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో పోలీస్ కార్ల మరమ్మతుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన భారీ హైడ్రాలిక్ యంత్రంతో పాటు, వాహన టైర్లను తొలగించి, అమర్చే యంత్రాన్ని సీపీ ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలసి ఈ యంత్రాల పనితీరును పరిశీలించారు.
