V6 News

బీజేపీది   మహిళలపై కపట ప్రేమ  : వరంగల్ డీసీసీ ప్రెసిండెంట్ మహ్మద్ ఆయూబ్

బీజేపీది   మహిళలపై కపట ప్రేమ  : వరంగల్ డీసీసీ ప్రెసిండెంట్ మహ్మద్ ఆయూబ్

గ్రేటర్​ వరంగల్, వెలుగు: మహిళలపై బీజేపీ నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారని, మహిళా రిజర్వేషన్‌‌‌‌ను 2024లో ఎందుకు అమలు చేయలేదని వరంగల్ డీసీసీ ప్రెసిండెంట్ మహ్మద్ ఆయూబ్ ప్రశ్నించారు. ఆదివారం కరీమాబాద్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు.

పార్లమెంట్‌‌‌‌లో బీజేపీ కూటమి తీసుకొస్తున్న బిల్లులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సరైన చర్చ చేయకుండానే బిల్లు హడావిడిగా ప్రవేశపెట్టడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా కూటమి, ఏకతాటిపైకి వచ్చి బీజేపీ తీరును తిప్పికొడుతున్నాయని ఆయన తెలిపారు.