వీడియో: పంజాబ్ సీఎంతో ఫరూక్ అబ్దుల్లా డ్యాన్స్

వీడియో: పంజాబ్ సీఎంతో ఫరూక్ అబ్దుల్లా డ్యాన్స్

చండీగఢ్: జమ్మూ కశ్మర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్‌‌తో కలసి డ్యాన్స్ చేశారు. అమరిందర్ మనవరాలు సెహరిందర్ కౌర్ పెళ్లికి హాజరైన అబ్దుల్లా.. వేడుకలో స్టెప్పులు వేసి అలరించారు. తాను డ్యాన్స్ చేయడమే గాక అమరిందర్ సింగ్‌‌తోనూ అబ్దుల్లా స్టెప్పులు వేయించారు. ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీ పాడిన ఆజ్ కల్ తేరె మేరె ప్యార్ కే చెహ్రేతోపాటు గులాబీ ఆంఖే జో తెరీ దేఖీ పాటలకు అబ్దుల్లా, అమరిందర్ చిందులు వేశారు.