కేరళ స్కూళ్లల్లో వాటర్ బెల్ : తెలుగు రాష్ట్రాల్లో ఈ బెల్ ఉంటే ఎంత బాగుంటుందో

కేరళ స్కూళ్లల్లో వాటర్ బెల్ :  తెలుగు రాష్ట్రాల్లో ఈ బెల్ ఉంటే ఎంత బాగుంటుందో

దేశంలో 28 రాష్ట్రాల ఉండగా ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలన, లేబర్ పాలసీ, ఉద్యోగ భద్రత, విద్యావంతుల్ని తీర్చిదిద్దేందుకు ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పుడు తమ రాష్ట్రాన్ని దేశంలో అన్నీ రాష్ట్రాలు అదర్శంగా తీసుకునేలా స్కూళ్లలో సరికొత్త విధానాన్న అమలు చేస్తుంది.

కేరళ రాష్ట్రం అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. అధికారంలో ఎవరు ఉన్నా. ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా సరే అభివృద్ధే వాళ్ల మంత్రం అందుకే. కేరళలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా 94శాతం విద్యావంతులు అధికంగా ఉన్నారు. ఇప్పుడు 100కి 100శాతం విద్య, విద్యార్ధుల ఆరోగ్యం కోసం వాటర్ బెల్ అనే పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ వాటర్ బెల్స్ పై విద్యార్ధుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా స్కూళ్లలో విద్యార్ధులకు లంచ్ అవర్, బ్రేక్ అవర్, స్పోర్ట్స్ అవర్ అంటూ క్లాస్ నిర్వహించడం కామన్. కానీ కేరళ రాష్ట్రంలో మాత్రం విద్యార్ధుల కోసం వాటర్ బెల్స్  పద్దతిని పాటిస్తున్నారు.

పిల్లలు, టీనేజర్స్ ప్రతీరోజు మూడులీటర్ల నీళ్లు త్రాగాలి. కానీ స్కూళ్లలో మంచినీటి సౌకర్యాలు, సరైన మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మంచినీటిని తాగేందుకు ఇష్టపడడం లేదు. దీంతో పిల్లల్లో తలనొప్పి, చిరాకుతో పాటు ఫిజికల్ గా వీక్ గా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఈ సమస్య ను అధిగమించేలా వాటర్ బెల్స్ ను అస్త్రంగా ఉపయోగించుకుంటుంది. దీంతో విద్యార్ధుల ఆరోగ్యం, సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల చదువుకు దూరంగా ఉండే సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నారు.  ఈ విధానంపై తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్ధుల తల్లిదండ్రులు కేరళ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాటర్ బెల్స్ విధానాన్ని అందుబాటులోకి తెస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.