స్కాలర్​ బాయ్​.. 10 మిలియన్ డాలర్స్ స్కాలర్​షిప్స్​ కావాలి

స్కాలర్​ బాయ్​.. 10 మిలియన్ డాలర్స్ స్కాలర్​షిప్స్​ కావాలి

స్కూల్ చదువు అయిపోగానే కాలేజీలో చేరడానికి ఏ కాలేజీ బాగుందా? అని రెండు మూడు కాలేజీలు చూస్తారు. నచ్చిన కాలేజీలో చేరతారు. అయితే, డెన్నిస్​ బార్నెస్​ అనే స్టూడెంట్​ మాత్రం ఒకటి రెండు కాదు ఏకంగా 200 కాలేజీలు, యూనివర్సిటీలకు అప్లయ్​ చేశాడు! 

న్యూ ఆర్లియన్స్ ఇంటర్నేషనల్ హై స్కూల్​లో చదివిన డెన్నిస్ స్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజీలో చేరాలనుకున్నాడు. అందుకోసం 200 కాలేజీలు, యూనివర్సిటీలకు అప్లై చేశాడు.125 కాలేజీల్లో అడ్మిషన్​​ దొరికింది. రెండొందల కాలేజీలకు ఆగస్ట్​లో అప్లై చేశాడు. ఇప్పుడు వాటి రిటర్న్ లెటర్​లతో మెయిల్ బాక్స్ నిండిపోయిందట. పైగా వాటిలో వందల సంఖ్యలో స్కాలర్​ఫిప్ ఆఫర్స్ ఉన్నాయన్నాడు బార్నెస్. అవన్నీ కలిపితే ఇప్పటి వరకు 9మిలియన్​ డాలర్ల స్కాలర్​షిప్స్ వచ్చాయి.

2019లో ఒకతను 8.7 మిలియన్ డాలర్స్ స్కాలర్​షిప్స్​తో రికార్డ్​ సెట్ చేశాడు. అతని రికార్డ్​ని బార్నెస్​ బ్రేక్ చేశాడు. అయితే ‘‘ఇది నా గోల్ కాదు.10 మిలియన్ డాలర్స్ స్కాలర్​షిప్స్​ కావాలి అనుకుంటున్నా. అందుకోసం ఇంకా ఒక నెల టైం ఉంది. ఏ కాలేజీలో చేరతాననేది మాత్రం సస్పెన్స్’​’ అంటున్నాడు బార్నెస్. కంప్యూటర్ సైన్స్​, క్రిమినల్ జస్టిస్​లో ఒకేసారి రెండు డిగ్రీలు చేయాలనుకుంటున్నాడు. ఈ వెరైటీ అప్లికెంట్​ ఏ కాలేజీలో చేరతాడో మే 2న తెలుస్తుంది. .