టెక్నాలజీ :  మల్టిపుల్ యాప్​లు ఒకేసారి డౌన్​లోడ్

టెక్నాలజీ :  మల్టిపుల్ యాప్​లు ఒకేసారి డౌన్​లోడ్

గూగుల్ ప్లేస్టోర్​లో రకరకాల యాప్​లను డౌన్​లోడ్ చేయడం తెలిసిందే. అయితే, ఒకేసారి రెండు మూడు యాప్​లను డౌన్​లోడ్ చేసుకోవాలంటే మాత్రం కుదరదు. ఒకదాని తర్వాత మరొకటి చేయాల్సి ఉంటుంది. కానీ, అది మొన్నటిదాకా. ఇప్పుడు అలా కాదు.. రెండు యాప్​లను ఒకేసారి ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా రెండు యాప్​లు ఒకే టైంకి డౌన్​లోడ్ అవుతాయి.

మూడో యాప్​  ఇన్​స్టాల్ చేయాలనుకుంటే మాత్రం అది పెండింగ్​లో ఉంటుంది. ముందు రెండు యాప్​ల డౌన్​లోడ్​ పూర్తవ్వగానే అది కూడా పూర్తవుతుంది. కొత్తగా డౌన్​లోడ్ చేసుకునేటప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. యాప్​ని అప్​డేట్ చేస్తే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి డౌన్​లోడ్ అవుతాయి. మరి ఈ ఫీచర్​ వల్ల ఉపయోగం ఏంటంటే.. కొత్త ఫోన్​ కొన్నవాళ్లు కొన్ని యాప్స్ ఒకేసారి డౌన్​లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫీచర్ ద్వారా డౌన్​లోడ్ చేసుకునేందుకు గంట పట్టే టైం కాస్తా అరగంటలో అవుతుంది. ప్రస్తుతానికి రెండు యాప్​లు మాత్రమే ఒకేసారి ఇన్​స్టాల్ అవుతాయి. ఆ తర్వాత మరో రెండేసి చొప్పున యాప్స్​ ఇన్​స్టాల్ చేసుకోవాలి.