చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాతాం

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాతాం
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాడుతూనే ఉంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. సోమవారం విద్యానగర్ లోని కృష్ణయ్య ఇంటి వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ గౌడ్ కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీసీలపట్ల గౌరవముంటే వెంటనే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అవసరమయితే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లందరం  ఏకమై ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం హైదరాబాద్ అధ్యక్షుడు భూపేష్ సాగర్, నాయకులు శివ, కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.