నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెడుతం..నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ

నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెడుతం..నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ
  • పెద్ది ప్యామిలీని కంటికి రెప్పలా కాపాడుకుంటాం : కేటీఆర్, హరీశ్ రావు

వరంగల్/నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్‍ సీఎం కాగానే నర్సంపేట మెడికల్​కాలేజీకి పెద్ది సుదర్శన్​రెడ్డి పేరు పెడుతామని బీఆర్​ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ చెప్పారు. 

వరంగల్ జిల్లా నల్లబెల్లిలో సోమవారం నిర్వహించిన పెద్ది సుదర్శన్​రెడ్డి దశదిన కార్యక్రమానికి హరీశ్​రావుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ముందుగా సుదర్శన్ రెడ్డి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

అనంతరం జరిగిన సంతాప సభలో కేటీఆర్​మాట్లాడుతూ వరంగల్​జిల్లాలో ఉద్యమాలకు నాయకత్వం వహించిన సుదర్శన్​రెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉన్నారన్నారు. ఉద్యమంతో పాటు నర్సంపేట అభివృద్ధికి సుదర్శన్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్​నాయకత్వంలో తెలంగాణ వచ్చే వరకు, వచ్చిన తర్వాత పెద్ది సుదర్శన్​రెడ్డి చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు.

సుదర్శన్ రెడ్డి ప్రజల మనిషి  : హరీశ్ రావు

పెద్ది సుదర్శన్​రెడ్డి విద్యార్థి దశ నుంచి తుది శ్వాస వరకు ఉద్యమాలు, పోరాటాలే ఏజెండాగా ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. నర్సంపేటకు మెడికల్​కాలేజీ, పాకాలకు గోదావరి జలాలను తేవడానికి ఎంతో  కృషి చేశారన్నారు. 

సభలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్​రావు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్​రెడ్డి, పాడి కౌశిక్​రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్​భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, బానోతు శంకర్​నాయక్, సతీశ్ బాబు, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.