కోల్‌కతా: రాబోయే రోజుల్లో బీజేపీని దించేస్తామని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని చెప్పారు. ఎన్నికల్లో ఓటమిపై నిరాశ చెందొద్దని టీఎంసీ శ్రేణులకు సూచించారు. బుధవారం కాళీఘాట్‌లోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం బీజేపీపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం సువేందు అధికారిని ఉద్దేశించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘మన రాష్ట్రానికి ఎంతోమంది సీఎంలు వచ్చారు.. కానీ ప్రస్తుత సీఎం లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిన వ్యక్తిని సీఎంను చేశారు’ అని ఆరోపించారు.
