కోడ్ చెప్పిన వాళ్లకే పబ్ లోకి అనుమతి

కోడ్  చెప్పిన వాళ్లకే పబ్ లోకి అనుమతి

బంజారాహిల్స్  రాడిసన్ పబ్ లో  రెయిడ్ టైంలో 148 మంది ఉన్నారన్నారు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్.  తెల్లవారుజామున 1 తర్వాత  పుడింగ్ అండ్ మింక్ పబ్ లో సోదాలు చేశామన్నారు. టైం ముగిసిన తర్వాత కూడా పబ్ ను నడిపించారన్నారు. పబ్ లలో  ఒంటి గంట  వరకే  ఫుడ్ అనుమతి ఉందన్నారు. పబ్ మేనజర్స్ పై కేసుపెట్టామన్నారు.  జనరల్ మేనేజర్ డెస్క్ దగ్గర  డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయన్నారు. 5 ప్యాకెట్ల కొకైన్ దొరికిందన్నారు. మొత్తం 5 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశామన్నారు.  పబ్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు.మరో  నిందితుడు అర్జున్ మాచినేని పరారీలో ఉన్నాడన్నారు.

కస్టమర్ల డీటేయిల్స్ అన్నీ తీసుకున్నామన్నారు. పబ్ లో ఉన్నవాళ్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు ఆధారాల్లేవన్నారు. పబ్ జనరల్ మేనేజర్ సహకరించడం లేదన్నారు. జనరల్ మేనేజర్ సహకరిస్తే వివరాలు తెలుస్తాయన్నారు. జనరల్ మేనేజర్ 6 నెలల క్రితమే ఈ పబ్ లో చేరారన్నారు. పబ్ లో ఉన్న వాళ్లు డ్రగ్స్ తీసుకున్నారనే వివరాలు కూడా తెలియవన్నారు. పబ్ లో ఉన్నవాళ్ల శాంపిళ్లు తీసుకోలేదన్నారు.స్పెషల్ గా యాప్ పెట్టి  పబ్ కు వచ్చేవాళ్ల వివరాలను  నమోదు చేస్తున్నారన్నారు. ఓటీపీ చెబితేనే  పబ్ లోకి అనుమతిస్తున్నారన్నారు.

మరిన్ని వార్తల కోసం..

పబ్‎లో ప్రముఖులు.. లైవ్ అప్‎డేట్స్

డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్