పదేళ్ల కింద 10వేలు ఇప్పుడు కోటిన్నర

పదేళ్ల కింద 10వేలు ఇప్పుడు కోటిన్నర

WESTLIFE DEVELOPMENT LTD Stock Selling Resultsఏ షేరు ధరయినా ఎక్కువ కాలం పెరుగుతూ పోవడం చాలా అరుదు. కానీ ఇలాంటి ఘనతను మెక్‌‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను ఇండియాలో ఈస్ట్, వెస్ట్‌‌లో నిర్వహించే మాస్టర్ ఫ్రాంచైజ్ వెస్ట్‌‌లైఫ్ డెవలప్‌ మెంట్ స్టాక్ దక్కించుకుంది. పోటీ వాతావరణాన్ని తట్టుకుంటూ.. మార్కెట్‌ లో మెరుపులు మెరిపించడం ఈ స్టాక్‌‌కు సాధ్యమైంది. ఈ కంపెనీ స్టాక్ గత పదేళ్ల నుంచి ఇన్వెస్టర్లను ఊరిస్తూ.. మార్కెట్‌ లో దూసుకుపోయింది. గత పదేళ్ల కిందట అంటే 2009లో ఈ కంపెనీలో రూ.10 వేలు ఇన్వెస్ట్‌‌ చేస్తే, ఇప్పుడు ఇది రూ.1.45 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 1,449 రెట్ల రిటర్నులను ఇన్వెస్టర్ల చేతికందించింది. 2009లో ఈ కంపెనీ స్టాక్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ 2012–2013 వచ్చే నాటికి వెస్ట్‌‌లైఫ్ డెవలప్‌ మెంట్స్ స్టాక్ అంటే ఇన్వెస్టర్లకు పిచ్చి.

2009 మార్చిలో 0.20 పైసలు మాత్రమే ఉన్న ఈ షేరు ధర, 2013 డిసెంబర్ చివరి నాటి కి రూ.372కు పెరిగింది. 2013 నుంచి కూడా రూ.160 నుంచి రూ.400 రేంజ్‌‌లోనే కదలాడింది కానీ, అంతకుమించి కిందకి పడిపోలేదు. వెస్ట్‌‌లైఫ్ డెవలప్‌ మెంట్ స్టాక్‌‌కు ఎప్పడికప్పుడు మార్కెట్ బ్రోకర్లు బుల్లిష్ ట్రెండ్‌ అంచనాలతోనే, టార్గెట్ ధరను రూ.425గా సెట్ చేస్తున్నారు. వెస్ట్‌‌లైఫ్ డెవలప్‌ మెంట్ స్టాక్‌‌తో పాటు, బజాజ్ ఫైనాన్స్ కూడా ఇన్వెస్టర్లను ఊర్తిస్తూ ఉంది.

2009 మార్చిలో ఈ కంపెనీ స్టాక్‌‌లో రూ.10వేలు ఇన్వెస్ట్‌‌ చేస్తే, అది రూ.57 లక్షలకు పెరిగింది. అంటే వార్షికంగా 88 శాతం వృద్ధి అన్నమాట. అంతే కాక మన తెలుగు రాష్ట్రానికి చెందిన అవంతీ ఫీడ్స్ స్టాక్‌‌  కూడా ఇన్వెస్టర్లకు మంచి రిటర్నులు అందించిన జాబితాలో ఉంది. ఆస్ట్రాల్ పాలీ టెక్నిక్, అజంత ఫార్ మా, వినతి ఆర్గానిక్స్, ఎల్‌ ఏ ఒపాల ఆర్‌‌‌‌జీ, మయూర్ యూనిక్వోటర్స్, ఐషర్ మోటార్స్, పాలీ మెడిక్యూర్ వంటి మరికొన్ని స్టాక్స్ కూడా ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్టాక్స్‌‌లో 2009లో రూ.10వేల ఇన్వెస్ట్ చేస్తే, ఇటీవల కాలంలో ఇవి రూ.8 లక్షల నుంచి రూ.33 లక్షల వరకు రిటర్నులను అందించాయి.

గ్లోబల్ బ్రోకరేజీ మాక్వరీ ఇటీవల ఐషర్ మోటార్స్‌‌కు రూ.24వేల టా ర్గెట్ ధరతో ‘అవుట్ ఫర్‌‌‌‌ఫార్మ్’ రేటింగ్‌‌ను ఇచ్చింది. ఈ కంపెనీకి చెందిన రాయల్ ఎన్‌ ఫీల్డ్ సేల్స్ రాబోయే నెలల్లో పెరుగుతాయని ఈ బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. గత పదేళ్లలో స్టాక్ ధరలు 5వేల శాతానికి పైగా పెరిగిన షేర్లలో టీటీకే ప్రెస్టేజ్, స్టైలమ్ ఇండస్ట్రీస్, బాలక్రిష్ణ ఇండస్ట్రీస్, నాట్కో ఫార్ మా, హవేల్స్ ఇండియా, వీఐపీ ఇండస్ట్రీస్, గృహ్ ఫైనాన్స్, సుప్రీం ఇండస్ట్రీస్, విర్లపూల్ ఆఫ్ ఇండియా, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, ఆర్తి ఇండస్ట్రీస్, మిండా ఇండస్ట్రీస్, కేపీఆర్ మిల్ ఉన్నాయి.