వేములవాడ రూరల్, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం సందర్శించారు. వర్షానికి తడిసిన వడ్లను పరిశీలించారు. ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ తో వెంటనే మాట్లాడి.. లారీలు సమకూర్చాలని ఆదేశించారు. డీసీవో రామకృష్ణ, డీఏవో అఫ్జల్ బేగం, సివిల్ సప్లై అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ అబూబాకర్ పాల్గొన్నారు.
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణిలో అర్జీలు స్వీకరించారు. మొత్తం 154 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్పీ ఆఫీస్‌లో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌లో ఎస్పీ మహేశ్ బి.గీతే ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు.
