ప్లాస్మాబ్యాంక్ అంటివి.. ఏమైంది? కేటీఆర్

ప్లాస్మాబ్యాంక్ అంటివి.. ఏమైంది? కేటీఆర్

హైదరాబాద్ , వెలుగు : రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేస్తామని మినిస్టర్ కేటీఆర్ చెప్పి నాలుగు నెలలు అవుతుందని… మళ్లీ ఆయన ఆ ఊసే ఎత్తటం లేదని పీసీసీ కోశాధికారి, తెలంగాణ ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు గూడూరు నారాయణ రెడ్డి విమర్శించారు. ఏప్రిల్ 6 న ట్విట్టర్ లో కేటీఆర్ ప్లాస్మా బ్యాంక్ గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. ఎందుకు ఇప్పటికీ ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేయలేదో చెప్పాలని కేటీఆర్ ను ఆయన ప్రశ్నించారు. కావాల్సిన అనుమతులు, ల్యాండ్ ఇస్తే రెండు రోజుల్లో తాను ప్లాస్మా బ్యాంక్ ను ఏర్పాటు చేస్తానని మంగళవారం మీడియాకు రిలీజ్ చేసిన ప్రకటనలో గూడూరు నారాయణ రెడ్డిచెప్పారు. కరోనాను మంత్రి కేటీఆర్ తక్కువ అంచనా వేస్తూ నివారణ చర్యలు చేపట్టంలో నిరక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ ద్వారా వందల మందినుంచి ప్లాస్మా సేకరించి ఎంతో మంది మంచి చేశామన్నారు.

వానకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం