ఖుషి V/S శెట్టి..కథే అల్టిమేట్..మరి ఏ మూవీలో కంటెంట్ ఉంది?

ఖుషి V/S శెట్టి..కథే అల్టిమేట్..మరి ఏ మూవీలో కంటెంట్ ఉంది?

విజయ్ దేవరకొండ(Vijaydevarkonda) ఖుషి.. నవీన్ పోలిశెట్టి(Naveenpolishetty) మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీస్ వారం గ్యాప్లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు మూవీస్ రిలీజ్కు ముందు ఆడియన్స్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో ఏ మూవీ..ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో చూద్దాం..

ఫస్ట్.. విజయ్ దేవరకొండ..సమంత కాంబోలో వచ్చిన ఖుషి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆడియన్స్లో బజ్ క్రియేట్ చేసింది.ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన హేషం అబ్దుల్లా అద్భుతమైన సాంగ్స్ కంపోస్ చేశారు. ఒక్కో సాంగ్ తో..ఆడియన్స్ ను కట్టి పడేలా చేశాడు. ఇక టీజర్, ట్రైలర్స్ తో మేకర్స్ వావ్ అనిపించుకున్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా..విజయ్..సమంత మ్యూజిక్ కన్సర్ట్లో చేసిన డ్యాన్స్ వీపరీతంగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేశారు. దీంతో ఖుషి రిలీజైనా ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. వీకండ్ కంప్లీట్ అయ్యే లోపు కలెక్షన్స్ కూడా ఫర్వాలేదనిపించింది.

ఇక ఖుషి రిలీజ్ అయిన ఐదవ రోజు నుంచి..కంటెంట్ పైన,మిక్స్డ్ టాక్ రావడంతో..వసూళ్లు పడిపోయాయి. ఇక అంతలోనే షారుఖ్ జవాన్ మూవీ, నవీన్ మిస్ శెట్టి మూవీ రిలీజ్ అవ్వడంతో ఖుషి థియేటర్స్లో జాడే లేకుండా పోయింది. ఖుషి కథలో బలం లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడంతో వారంలోపే కథ ముగిసింది. ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యింది. కానీ ఖుషి మూవీకి పోటీగా..ఏ మూవీ రిలీజ్ కాలేదు. అయిన ఎక్కువ రోజులు ఆడకపోవడం కథలో కంటెంట్ లేకపోవడమే అంటున్నారు సినీ క్రిటిక్స్. 

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka shetty) జంటగా వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి( Miss shetty Mr Polishetty). లేటెస్ట్ గా సెప్టెంబర్‌ 7న రిలీజ్ అయినా ఈ మూవీ ఆడియన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటోంది.రిలీజ్ ఫస్ట్ డే పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసిన, షారుఖ్ జవాన్ మూవీ పోటీగా ఉండటంతో..కాస్త డల్ అయినట్లు కనిపించింది.కానీ, రిలీజ్ అయిన నాలుగో రోజు నుంచి థియేటర్స్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.

నవీన్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్కు..క్యారెక్టర్స్ ఎమోషన్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు. దీంతో మిస్ శెట్టి మరికొన్ని రోజులు థియేటర్స్ లో రన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్స్ విషయంలో హీరో  నవీన్ పోలిశెట్టి మాత్రమే తన భుజాన వేసుకుని మిస్ శెట్టిని ముందుకు నడిపించినట్లు సమాచారం. 

ఏ మూవీకి అయినా కథలో..మంచి కంటెంట్ ఉంటే చాలు..ఆడియాన్స్ ఎక్కువ రోజులు ఆదరిస్తారు..గుర్తించుకుంటారు.